మేలైనా కీడైనా Song Lyrics

మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా
చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా (2)
నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదను (2)
నిత్యము నీ కీర్తి నా నోట నుండును (2) ||మేలైనా||

కలిమి చేజారి నను ముంచినా
స్థితిని తలక్రిందులే చేసినా (2)
రెండింతలుగా దయచేసెదవని (2)
నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా (2) ||మేలైనా||

పరుల ఎగతాళి శృతి మించినా
కలవరము పొంది నే కృంగినా (2)
నా మొర విని కృప చూపెదవని (2)
నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా (2) ||మేలైనా||

శ్రమలు చెలరేగి బెదిరించినా
ఎముకలకు చేటునే తెచ్చినా (2)
ఆపదలలో విడిపించెదవని (2)
నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా (2) ||మేలైనా||

మేలైనా కీడైనా telugu christian video song


మేలైనా కీడైనా Song Lyrics