మరువద్దు మరువద్దు
తండ్రి ప్రేమ మరువద్దు
జీవితాన్ని వ్యర్ధించకుమా
విడువద్దు విడువద్దు
ప్రేమ బంధం విడువద్దు
నీదు స్థానం మరువద్దుమా
తిరిగి రావా తిరిగి రావా
తిరిగి రావా ఇంటికి (చెంతకు) రావా ||మరువద్దు||
నీకై నీతో జీవాన్ని పంచిన
నీలా నీతో స్నేహించిన (2)
కాచెను కనురెప్పలా
కాపాడెన్ దైవముగా (2)
ఆ ప్రేమే నిన్ను పిలిచే ||మరువద్దు||
లోకం స్నేహం సుఖ భోగ పాపాలు
అంతా మలినం మిగిలిందిగా (2)
ఆలస్యం చేయకుమా
వేగమే పరుగెత్తుమా (2)
నీ తండ్రి వేచియుండే ||మరువద్దు||