మాయాలోక ఛాయల్లోన Song Lyrics

మాయాలోక ఛాయల్లోన మోసం నాశనం ఉన్నాది (2)
నమ్మబోకు నమ్మబోకు సోదరా
ఈ మాయ లోకం నమ్మబోకు సోదరీ (2)
లోకమంతా తిరిగెదవా – లోకము నిన్నే ఏలునురా (2)
లోక రక్షకుడేసుని మాటకు లోబడుమిప్పుడే సోదరా
అక్కా మీరేమిట్లు – చక్కగ రండి మీరిట్లు
అన్నా మీరేమిట్లు – మనమే దేవుని పనిముట్లు
రొక్కాము లేకుండానే స్వర్గానికి పోదాం రండి
అక్కా మీరేమిట్లు – చక్కగ రండి మీరిట్లు
అన్నా మీరేమిట్లు – మనమే దేవుని పనిముట్లు

ప్రేమ గల దేవుడమ్మా – ప్రేమతో వచ్చాడమ్మా
రమ్మని పిలుచుచున్నాడు.. నిన్ను
అమ్మలా ఆదరిస్తాడు – అయ్యలా ఆదుకుంటాడు (2)
ఎంత ఘోర పాపివైన చింత లేదురా
సంతసమును నీకీయ స్వర్గము విడి యేసయ్యా
స్వర్గము విడి యేసయ్యా
చెంత చేరి ఈ క్షణమే సేదదీరుము
అంతు లేని ప్రేమలోనే మునిగి తేలుము
సమయమిదే కనుగొనుమా – త్వరపడు సుమ్మా – (2) ||ప్రేమ గల||

చెప్పినాడు యేసయ్యా – చక్కనైన మాటలెన్నో
శత్రువును సైతము ప్రేమించమన్నాడు – (2)
నిక్కముగ నిన్ను వలే పక్కవాన్ని సూడమని
ఎక్కడున్న గాని వాడు యేసుకు వారసుడే – (2)
అన్నయ్యా యేసులోకి రావాలయ్యా
అక్కయ్యా యేసులోకి రావాలమ్మా (3)

మాయాలోక ఛాయల్లోన telugu christian video song


మాయాలోక ఛాయల్లోన Song Lyrics