మార్పులేని తండ్రివి నీవే
చేయి వీడని స్నేహితుడవు నీవే (2)
వాక్యమై నను నడిపించే
ఆత్మయై నను ఓదార్చే (2)
యెహోవా రఫా యెహోవా యీరే
యెహోవా షాలోమ్ యెహోవా నిస్సీ
యెహోవా షమ్మా ఎలోహిం యావే
ఆకాశము భూమియు
గతియించినా గతియించనీ (2)
మారని నీ వాక్యమే
నను నడుపును సదా
మారని నీ మాటలే
నను నిలుపును సదా ||యెహోవా||
వాగ్ధానము నెరవేర్చుచు
నా రక్షణకరుడైతివి (2)
తండ్రి అని పిలిచినా
పలికెడి ప్రేమా (2) ||యెహోవా||