లెమ్ము తేజరిల్లుము నీకు Song Lyrics

లెమ్ము తేజరిల్లుము నీకు
వెలుగు వచ్చియున్నది (2)
యెహోవా మహిమ నీపై
ప్రకాశముగా నుదయించె (2) ||లెమ్ము||

యేసే యీ లోకమునకు
వెలుగై యున్నానని చెప్పెన్ (2)
యేసుని నమ్మువారు (2)
వెలుగులో నడుచువారు (2) ||లెమ్ము||

అంధకార మందుండి
బంధింప బడిన వారిన్ (2)
ఆశ్చర్యమైన వెలుగు (2)
నందించి విమోచించెన్ (2) ||లెమ్ము||

దాత ప్రభు యేసుని నమ్మి
నీతిగా నడుచువారు (2)
జాతి భేదములు లేక (2)
జ్యోతుల వలె నుందురు (2) ||లెమ్ము||

మనుజులు మీ సత్క్రియలను
జూచి బహు సంతోషించి (2)
మనసారా పరమ తండ్రిన్ (2)
మహిమ పరచెదరు (2) ||లెమ్ము||

జనములు నీ వెలుగునకు
పరుగెత్తి వచ్చెదరు (2)
రాజులు నీదు ఉదయ (2)
కాంతికి వచ్చెదరు (2) ||లెమ్ము||

లెమ్ము తేజరిల్లుము నీకు telugu christian video song


లెమ్ము తేజరిల్లుము నీకు Song Lyrics