కృతజ్ఞతతో స్తుతి పాడెద
నా యేసు నాథా
నాకై నీవు చేసిన మేళ్లకై
కోటి కోటి కృతజ్ఞతలు (2)
అర్హతే లేని నాపై నీదు
ప్రేమ చూపిన కృపామయా (2)
నా ఊహలకంటెను అధికముగా
దయచేయు ప్రేమామయా (2) ||కృతజ్ఞతతో||
నిజ రక్షకుడు యేసు క్రీస్తని
విశ్వసించెద అను నిత్యము (2)
నీ పాద సేవలో బ్రతుకుటకై
నీ వరము ప్రసాదించుము
నీ పాద సేవలో బ్రతుకుటకై
వరములతో అభిషేకించు ||కృతజ్ఞతతో||