కొండల తట్టు నా కన్నులు Song Lyrics

కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను (2)
నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును (2)
యెహోవా వలనే – యెహోవా వలనే
నాకు సహాయం కలుగును – కలుగును (2) కలుగును

భూమ్యాకాశంబులను – సృజియించిన దేవా
నా పాదంబులను – తొట్రిల్లనీయడు (2)
నను కాపాడువాడు కునుకడు – నిదురపోడెన్నడు (2)
యెహోవా నను ప్రేమించి – కాపాడి రక్షించును (2) ||యెహోవా||

నా కుడిప్రక్క నీడగా – యెహోవా ఉండును
పగటి ఎండ రాత్రి వెన్నెల – దెబ్బైన తగలక (2)
ఏ అపాయము నాకు రాకుండా – యెహోవా కాపాడును (2)
నా రాకపోకలయందును – కాపాడి రక్షించును (2) ||యెహోవా||

వేటకాని ఉరిలోనుండి – విడిపించిన దేవా
నాశనకరమైన తెగులు రాకుండ – రక్షించిన దేవా (2)
నీ బలమైన రెక్కలతో కప్పుమయా – మా రక్షణ ఆధారమా (2)
నా కుడిప్రక్క పదివేలు కూలిననూ – నీ కృపచేత కాపాడుమా (2) ||యెహోవా||

కొండల తట్టు నా కన్నులు telugu christian video song


కొండల తట్టు నా కన్నులు Song Lyrics