కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా (2)
క్షమాపణ నిన్ను వేడుచున్నాను (2)
దావీదు రాజు దీనుడై వేడ (2)
అవనిలో బొందిన నష్టములన్నియు (2)
దేవా నీవు సమకూర్చితివే (2) ||కరుణించి||
శత్రు సమూహపు కుతంత్రములతో (2)
బొత్తిగా నేను నష్టపడితిని (2)
మిత్రుడేసులో సమకూర్చుము తండ్రి (2) ||కరుణించి||
పసరు గొంగళి – చీడ పురుగులు (2)
నాశనము చేసిన పంటను కూర్చుమా (2)
యేసు ప్రభూ నిన్ను వేడుచున్నాను (2) ||కరుణించి||
ప్రేమ సంతోషానందములను (2)
ప్రధాన యాజకా పోగొట్టుకొంటిని (2)
ప్రేమతో నీవు సమకూర్చుమా (2) ||కరుణించి||
పాపపు విషముతో నా పాత్ర నిండెను (2)
ప్రభు యేసుండను పిండిని కలుపుము (2)
పాప మరణమును తొలగించుమా (2) ||కరుణించి||
ఆత్మీయ సోమరితనములో నుండి (2)
ఆత్మ నష్టముల నెన్నియో బొందితి (2)
ఆత్మ దేవా నీవు సమకూర్చుమా (2) ||కరుణించి||
పాపము చేసి పడియున్న చోటున్ (2)
ప్రాపుగా నీవు జూపుమో ప్రభువా (2)
కోపగించక నాపై కృప జూపుమా (2) ||కరుణించి||
చేసిన పాపము కప్పుకొనక (2)
విశ్వాసముతో ఒప్పుకొందున్ (2)
సిలువ రక్తముతో శుద్ధి చేయుమా (2) ||కరుణించి||