కనులున్నా కానలేని చెవులున్నా వినలేని (2)
మనసున్నా మతిలేని స్తితియున్నా గతిలేని (2)
వాడను యేసయ్యా
ఓడిపోయిన వాడను (2) ||కనులున్నా||
అన్ని ఉన్నా ఏమిలేని అందరు ఉన్న ఏకాకిని
దారి ఉన్నా కానరాని చెంతనున్నా చేరలేని
యేసయ్యా నన్ను విడువకయ్యా (2)
దిక్కులేని వాడను
వాడను యేసయ్యా
చెదరిపోయిన గూడును (2) ||కనులున్నా||
భాషలున్నా భావములేని ఆత్మ ఉన్నా అవివేకిని
భక్తి ఉన్నా శక్తిలేని ప్రార్థన ఉన్నా ప్రేమలేని
యేసయ్యా నన్ను కరుణించుమా (2)
ఫలములేని వాడను
వాసిని యేసయ్యా
పేరుకు మాత్రమే విశ్వాసిని (2) ||కనులున్నా||
బోధ ఉన్నా బ్రతుకులేని
పిలుపు ఉన్నా ప్రయాసపడని
సేవ ఉన్నా సాక్ష్యములేని
సంఘము ఉన్నా ఆత్మలులేని
యేసయ్యా నన్ను నింపుమయ్యా (2)
ఆత్మలేని వాడను
పాదిరిని యేసయ్యా
మాదిరి లేని కాపరిని (2) ||కనులున్నా||