కల్వరిలోన చేసిన యాగం
మరణము గెలిచిన నీ యొక్క త్యాగం (2)
కడిగి వేసెను నాదు పాపం
నిలిపె నాలో నీ స్వరూపం (2) ||కల్వరిలోన||
ఆ పాపులు అలుపే లేక నిను కొట్టిన దెబ్బలు
తొలగించే నాపై ఉన్న ఆ ఘోర శాపాలు
పరిశుద్ధ దేహముపై చెలరేగెను కొరడాలు
నాలోని రోగాలకై పొందితివా గాయాలు (2)
దైవ సుతుడవే అయిన గాని
కనికరము వీడవు ఏల క్షణమైనా గాని (2) ||కల్వరిలోన||
ఏ దోషం లేని దేహం మోసెను సిలువ భారం
రద్దాయెను నాలో నేరం తగ్గించెను నా భారం
నువ్వు పొందిన అవమానం నను ఉన్నతి చేర్చెను
చిందించిన నీదు రక్తం పరిశుద్ధుని చేసెను (2)
నిన్నే బలిగా నువ్వు మార్చుకుంటివి
నన్ను రక్షించుటకు వేదన పడితివి (2) ||కల్వరిలోన||
సిలువలో వ్రేలాడుతూ నువ్వు పొందిన దాహము
అందించేను నా కొరకై ఆ జీవ జలము
కఠినులుగా మారి నీకు అందించిన ఆ చేదు
నింపేను నాలో మధురం తొలగించే నా కుటిలం (2)
అధికారమే లేని మరణము నిలిచెను
నిన్ను తాకేందుకు అనుమతి కోరెను (2) ||కల్వరిలోన||