కావలెనా యేసయ్య Song Lyrics

కావలెనా యేసయ్య బహుమానము
(మరి) చేయాలి విలువైన ఉపవాసము (2)
సిద్ధమౌ శ్రీ యేసుని ప్రియా సంఘమా
చిగురించాలి అంజూరపు చెట్టు కొమ్మలా (2) ||కావలెనా||

నీనెవె పట్టణము యెహోవా దృష్టికి
ఘోరమాయెను – పాపముతో నిండిపోయెను
సృష్టికర్త యెహోవా యోనాను దర్శించి
నీనెవెకు పంపెను – కనికరము చూపించెను
ఘనులేమి అల్పులేమి – నీనెవె పట్టణపు రాజేమి
పిల్లలేమి పెద్దలేమి – ఉపవాసము చేయగా
ఆగింది యెహోవా శాపము
కురిసింది కరుణ వర్షము (2) ||కావలెనా||

దేవుని ప్రజలను నశియింప చేయుటకు
దుష్టుడు తలచెను – కలవరము పుట్టించెను
మొర్దెకై వేదనతో రాజునొద్దకు పంపుట
దైవ చిత్తమని – ఎస్తేరును సిద్ధపరచెను
ఘనులేమి అల్పులేమి – షూషను కోటలో రాణి ఏమి
పిల్లలేమి పెద్దలేమి – ఉపవాసము చేయగా
అణిగింది హామాను గర్వము
జరిగింది దేవుని చిత్తము (2) ||కావలెనా||

కావలెనా యేసయ్య telugu christian video song


కావలెనా యేసయ్య Song Lyrics