జీవితమంతా నీ ప్రేమ Song Lyrics

జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో దేవా
ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనంద గానంబుతో (2)

సర్వ సమయములలో నీ స్తుతి గానం
ఎల్లవేళలయందు నీ నామ ధ్యానం (2)
మాకదియే మేలు ఈ జీవితమున
స్తుతియింతు నా రక్షకా – (2) ||జీవితమంతా||

సృష్టినంతటిని నీ మాట చేత
సృజియించితివిగా మా దేవ దేవా (2)
నీ ఘనమగు మహిమం వర్ణింప తరమా
స్తుతియింతు నా రక్షకా – (2) ||జీవితమంతా||

కలుషాత్ములమైన మా కొరకు నీ
విలువైన ప్రాణంబు నర్పించితివిగా (2)
కల్వరి గిరిపై చూపిన ప్రేమన్
స్తుతియింతు నా రక్షకా – (2) ||జీవితమంతా||

జీవితమంతా నీ ప్రేమ telugu christian video song


జీవితమంతా నీ ప్రేమ Song Lyrics