ఇంతవరకు నీవు Song Lyrics

ఇంతవరకు నీవు – నన్ను నడిపించుటకు
నేనేమాత్రము నా జీవితం ఏ మాత్రము
ఇంతవరకు నీవు నన్ను భరియించుటకు
నేనేమాత్రము మేము ఏ మాత్రము

నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే
నే చూచే ఘనకార్యములు నీ దయ వలెనే (2) ||ఇంతవరకు||

ఎన్నుకొంటివే నన్ను ఎందుకని
హెచ్చించితివే నన్ను ఎందుకని (2)
మందను వెంటాడి తిరుగుచుంటినే (2)
సింహాసనం ఎక్కించి మైమరచితివే (2) ||నే చూచిన||

నా ఆలోచనలన్ని చిన్నవని
నీ ఆలోచనల వలనే తెలుసుకొంటినే (2)
తాత్కాలిక సహాయము నే అడిగితినే (2)
యుగయుగాల ప్రణాళికలతో నను నింపితివే (2) ||నే చూచిన||

ఇంతవరకు నీవు telugu christian video song


ఇంతవరకు నీవు Song Lyrics