ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2)
ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా (2) ||ఇంత కాలం||
ఎన్ని ఏళ్ళు గడచినా –ఎన్ని తరాలు మారినా (2)
మారని వీడని ప్రేమే నీదయ్యా
మార్చిన నా జీవితం నీకే యేసయ్యా (2) ||ఇంత కాలం||
నీవు చేసిన మేలులు –తలచుకుందును అనుదినం (2)
నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా
వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా (2) ||ఇంత కాలం||
దూరమైతిరి ఆప్తులు – విడచిపోతిరి నా హితులు (2)
శోధన వేదన తీర్చిన యేసయ్యా
తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా(2) ||ఇంత కాలం||