గుండె నిండా యేసు ఉంటే Song Lyrics

గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు
గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైనా సంతోషం (2)
గుండె నిండా నువ్వే
యేసు గుండె నిండా నువ్వే (4)

లోక స్నేహం వెలివేసినా
శోకంలో ముంచి వేసినా – నీవే నా నేస్తం
నా హృదయం చెప్పేదొక్కటే
గుండె నిండా నువ్వే (2) ||గుండె నిండా నువ్వే||

ఊపిరంతా శాపమైనా
గాలి కూడా గేలిచేసినా – నీవే నా చెలిమి
జాలి లేని ఇలలోన
నీవే నా కలిమి (2) ||గుండె నిండా నువ్వే||

చిరకాలం నీ ఒడిలో
ఉండాలని ఆశతో
చెమ్మగిల్లే కలలతోనే
పాడుతున్నా గీతం (2) ||గుండె నిండా నువ్వే||

గుండె నిండా యేసు ఉంటే telugu christian video song


గుండె నిండా యేసు ఉంటే Song Lyrics