గొంతు ఎత్తి చాటెదాను Song Lyrics

గొంతు ఎత్తి చాటెదాను
నడుము కట్టి పయనింతును
నా యేసు గొప్పవాడు (4)
నిన్ను నన్ను ఎన్నడూ విడువలేనన్నాడు
నీ కొరకే నేనన్నాడు (2)
నా యేసు గొప్పవాడు (4) ||గొంతు||

ఎంత గొప్ప కార్యము చేసినాడు
ఎర్ర సంద్రమునే చీల్చినాడు
ఎంత గొప్ప మహిమను తెచ్చినాడు
యెరికో గోడలు కూల్చినాడు (2)
ఎంతాటి కార్యమైనా చేయగలడు
శక్తివంతుడు అసాధ్యుడు (2)
నా తండ్రి గొప్పవాడు (4) ||గొంతు||

ఎంత గొప్ప కార్యము చేసినాడు
నిషేధించిన రాయి స్థానం మార్చాడు
పనికిరాని పాత్రను వాడగలడు
గొప్పదైన దానిగా చేయగలడు (2)
ఎన్నిక లేని నన్ను ఎన్నుకున్నాడు
ఎంత గొప్ప దేవుడు నా యేసుడు (2)
నా యేసు గొప్పవాడు (4) ||గొంతు||

కన్న తల్లి కన్న తండ్రి చూపలేనిది
నా యేసు తండ్రి చూపుతాడు
ఈ లోక స్నేహం ఇవ్వలేనిది
నా యేసు ప్రాణం ఇచ్చినాడు (2)
ఎన్నాడు విడువని గొప్ప దేవుడు
లోకమంతా విడిచినా నిన్ను విడువడు (2)
నా యేసు గొప్పవాడు (4) ||గొంతు||

గొంతు ఎత్తి చాటెదాను telugu christian video song


గొంతు ఎత్తి చాటెదాను Song Lyrics