ఎంతో సుందరుడమ్మ తాను…
ఎంతో సుందరుడమ్మ తాను
నేనెంతో మురిసిపోయినాను (2) ||ఎంతో||
ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు (2)
అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు (2)
ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు
అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు – (2)
ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు (2)
అవలీలగా నతని గురితింపగలనమ్మా (2) ||ఎంతో||
కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు (2)
మరులు మనసున నింపు మహనీయుడాతండు (2)
కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు
మరులు మనసున నింపు మహనీయుడాతండు – (2)
సిరులు కురిపించేను వర దేవ తనయుండు (2)
విరబూయు పరలోక షారోను విరజాజి (2) ||ఎంతో||
పాలతో కడిగిన నయనాలుగలవాడు (2)
విలువగు రతనాల వలె పొదిగిన కనులు (2)
పాలతో కడిగిన నయనాలు గలవాడు
విలువగు రతనాల వలె పొదిగిన కనులు – (2)
కలుషము కడిగిన కమలాల కనుదోయి (2)
విలువైన చూపొసఁగె వరమేరి తనయుండు (2) ||ఎంతో||
మేలిమి బంగారు స్థలమందునిలిపిన (2)
చలువ రాతిని బోలు బలమైన పాదాలు (2)
మేలిమి బంగారు స్థలమందు నిలిచినా
చలువ రాతిని బోలు బలమైన పాదాలు – (2)
ఆ లెబానోను సమారూప వైఖరి ఆ.. ఆ.. (2)
బలవంతుడగువాడు బహుప్రియుడాతండు (2) ||ఎంతో||
అతడతికాంక్షానీయుండు తనయుండు (2)
అతడే నా ప్రియుడు అతడే నా హితుడు (2)
అతడతికాంక్షానీయుండు తనయుండు
అతడే నా ప్రియుడు అతడే నా హితుడు – (2)
ఆతని నొరతి మధురంబు మధురంబు (2)
ఆతని పలు వరుస ముత్యాల సరి వరుస (2) ||ఎంతో||