ఎంత ప్రేమో నాపై యేసయ్యా
నేను ఎలాగ వివరించగలనయ్యా (2)
పెంట కుప్పలలో పడి ఉన్ననూ
నా మెడ మీద పడి ముద్దు పెట్టితివా
జిగట ఊబిలో నేను దిగి ఉన్ననూ
నా చేయి పట్టి నను పైకి లేపితివా ||ఎంత||
దాహం తీర్చగలేని బావి అయిననూ
నేను పాపపు కుండను విడువకుంటిని (2)
నా పాపమంత క్షమించితివి (2)
జీవ జలమిచ్చి నన్ను చేర్చుకుంటివి (2) ||ఎంత||
పందులున్న చోట నలిగి పడి ఉంటిని
నా పాపమే చుట్టు ముట్టి పట్టుకున్నది (2)
బుద్ధి వఛ్చి నేను నిన్ను ఆశ్రయించగా (2)
క్షమియించి నీ రక్షణిచ్చితివి (2) ||ఎంత||
నరికిన కొమ్మ వలె ఎండిపోతిని
నా పాపాన్ని దాచి దాచి నశించితిని (2)
ఒప్పుకొనగా నాకు జీవమిచ్చితివి (2)
(ఎండిన) మొద్దును చిగురింపజేసితివి (2) ||ఎంత||