ఎంత ప్రేమ యేసయ్యా Song Lyrics

ఎంత ప్రేమ యేసయ్యా – ద్రోహినైన నా కొరకు
సిలువలో ఆ యాగము చేసావు – రక్తము కార్చావు
ఎందుకు ఈ త్యాగము – పాపినైన నా కొరకు
సిలువలో ఆ యాగము నొందను – రక్తము చిందను
సురూపమైనా సొగసైనా లేకపోయెను (2)
యేసు నిలువెల్ల రక్త ధారలు కారిపోయెను (2)
నలిగిపోయెను – విరిగిపోయెను

ఎంత శ్రమను ఎంత బాధను
అనుభవించినాడే విభుడు (2)
మనకు క్షమాపణ ఇచ్చెను
అభయము కలుగజేసెను
హింసింపబడి దూషింపబడి
హింసింపబడి దూషింపబడెను
కరుణతో నను రక్షింప
నా కోసమే ఈ యాగమా ||ఎంత ప్రేమ||

సమస్తము సంపూర్ణమాయెను
జీవముకై మార్గము తెరిచెను (2)
అపవాదిని అణచివేసి
మరణ ముల్లును విరచి వేసెను
విజయశీలుడై తిరిగి లేచెను
పరిశుద్ధాత్మను తోడుగా ఇచ్చెను
పునరుత్తానుడు మనకు తోడుగా నిత్యము నిలచే

ఎంత ప్రేమ యేసయ్యా telugu christian video song


ఎంత ప్రేమ యేసయ్యా Song Lyrics