ఎందుకో ఈ ప్రేమ Song Lyrics

ఎందుకో ఈ ప్రేమ నన్నింతగ ప్రేమించెను
ఎందుకో ఈ జాలి నాపై కురిపించెను (2)
ఏ యోగ్యత లేని ఓటి కుండను
నీ పాత్రగ చేసి ఎన్నుకుంటివి (2)
ఎనలేని కృపనిచ్చితివి ||ఎందుకో||

నీ సన్నిధి పలుమార్లు నే వీడినానే
అయినా నీవు క్షమియించినావే
ఊహించని మేలులతో దీవించినావే
నా సంకటములను కదా తీర్చినవే (2)
ఏ యోగ్యత లేని దీనుడను
ఏమివ్వగలను నీ ప్రేమకు
(నా) సర్వం నీకే అర్పింతును – (2) ||ఎందుకో||

మా కొరకు బలి పశువై మరణించినావు
మా పాప శిక్ష తొలగించినావు
పలు విధముల శోధనలో తోడైనావు
ఏ కీడు రాకుండ మేము కాచినావు (2)
రుచి చూపినావు నీ ప్రేమను
ఆ ప్రేమలో నేను జీవింతును
నీవే నాకు ఆధారము – (2) ||ఎందుకో||

ఎందుకో ఈ ప్రేమ telugu christian video song


ఎందుకో ఈ ప్రేమ Song Lyrics