ఎల్లవేళలందు Song Lyrics

ఎల్లవేళలందు – కష్టకాలమందు
వల్లభుండా యేసున్‌ స్తుతింతున్‌
ఎల్లను నీవే నా కెల్లెడల
వల్లపడదే వివరింపన్‌ (2)

విమోచకుడా – విమోచన నీవే
రక్షకుడవు – నా రక్షణ నీవే (2) ||ఎల్లవేళలందు||

సృష్టికర్తవు – సహాయము నీవే
ఇష్టుడ నీవు – త్రిత్వము నీవే (2) ||ఎల్లవేళలందు||

జ్ఞానము నీవే – నా పానము నీవే
దానము నీవే – నా గానము నీవే (2) ||ఎల్లవేళలందు||

జ్యోతివి నీవే – నా నీతివి నీవే
ఆదియు నీవే – నా అంతము నీవే (2) ||ఎల్లవేళలందు||

నిత్యుడ నీవే – నా సత్యుండ నీవే
స్తోత్రము నీవే – నా నేత్రము నీవే (2) ||ఎల్లవేళలందు||

జీవము నీవే – నా దేవుడవు నీవే
పావన నీవే – నా కావలి నీవే (2) ||ఎల్లవేళలందు||

కాంతియు నీవే – నా శాంతియు నీవే
సంతస నీవే – నాకంతయు నీవే (2) ||ఎల్లవేళలందు||

ఎల్లవేళలందు telugu christian video song


ఎల్లవేళలందు Song Lyrics