ద్రాక్షావల్లివి నీవైతే Song Lyrics

ద్రాక్షావల్లివి నీవైతే
తీగెగ నేను ఎదిగితిని (2)
తండ్రి తోటలో నే నాటబడితి
ఎంత ధన్యత ఈ మహిలో – (2) ||ద్రాక్షా||

చల్ల గాలులు వీచగా
కాంతి కిరణాలు ప్రసరించగా (2)
నీతి సూర్యుని నిజ కాంతిలోన
తేజరిల్లెడి బ్రతుకు తోడ
రక్షణ తోటలో విరివిగ పెరిగి
నీటి యోరన నిలిచితిని – (2) ||ద్రాక్షా||

కొమ్మ కొమ్మను చూడగా
తీగలెన్నో అగుపించెనే (2)
ఆకు మాటున తీగె గావున
మొలవనున్నవి ఫలములెన్నో
నిలిచె అందులో ఫలితము కొరకై
కలిగె స్నేహము యేసునితో – (2) ||ద్రాక్షా||

ద్రాక్షావల్లివి నీవైతే telugu christian video song


ద్రాక్షావల్లివి నీవైతే Song Lyrics