దేవుడొక నగరము Song Lyrics

దేవుడొక నగరము మన కొరకై
సిద్ధపరచుచుండె నుండుటకై (2)
మనము వెళ్ళెదం నిశ్చయముగా (2) ||దేవుడొక||

మేలిమి బంగారము అద్భుత నగరం
విలువైన రాళ్ళతో పునాది వేసెను (2)
రక్తముచే శుద్ధులై క్షమించబడితిమి (2)
మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2) ||దేవుడొక||

నగర ప్రాకారములు ఎత్తైనవి
సూర్య కాంతములచే కట్టబడెను (2)
ప్రభువే విమోచించి అధికారమిచ్చెను (2)
మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2) ||దేవుడొక||

ముత్యాల గుమ్మములు పండ్రెండు గలవు
పన్నిద్దరు దూతలు అచ్చట నుండిరి (2)
పరిశుద్ధ జీవితం నేర్పించెను ప్రభువు (2)
మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2) ||దేవుడొక||

ఆ నగర వీధులు మేలిమి బంగారం
ద్వారములు ఎప్పటికి మూయబడవు (2)
ఆర్భాటంతో ప్రవేశించి విజయోత్సవంబుతో (2)
మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2) ||దేవుడొక||

గొర్రెపిల్ల సింహాసన మచ్చటుండును
ఆయనే దీపము నాలయమై యుండును (2)
జీవగ్రంథమందున పేరులున్నవనుచు (2)
మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2) ||దేవుడొక||

జయవంతుల కొరకే ఆ నగరం
పాపాత్ములు అచ్చటకు వెళ్ళనేరరు (2)
విజయుల మౌదము క్రీస్తుని రక్తముచే (2)
మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2) ||దేవుడొక||

దేవుడొక నగరము telugu christian video song


దేవుడొక నగరము Song Lyrics