అర్పించుచుంటిని యేసయ్యా Song Lyrics

అర్పించుచుంటిని యేసయ్యా
నన్ను నీ చేతికి (2)
దీనుడను నన్ను నీ బిడ్డగా
ప్రేమతో స్వీకరించు (2) ||అర్పించుచుంటిని||

ఈ లోక జీవితం అల్పకాలమే
నీవే నా గమ్యస్థానము (2)
నిజ సంతోషం నీవు నాకిచ్చి (2)
నా హృదయం వెలిగించు (2)
నా ప్రభువా యేసయ్యా ||అర్పించుచుంటిని||

దప్పిగొన్న జింకవలెనే
ఆశతో చేరితి నీ దరి దేవా (2)
సేదతీర్చి జలము నిన్ను (2)
వాడిన బ్రతుకులో (2)
నింపుము జీవము ||అర్పించుచుంటిని||

అర్పించుచుంటిని యేసయ్యా telugu christian video song


అర్పించుచుంటిని యేసయ్యా Song Lyrics