అంధకార చెరసాలలో – బంధకాల ఇరుకులో
పౌలు సీలలు ప్రార్ధించిరి – కీర్తనలు పాడిరి – (2)
భూమియే కంపించెను – చెరసాల అదిరెను
వారి సంకెళ్లు ఊడిపోయెను – విడుదల దొరికెను – (2)
వ్యాధులు ఆవరించగా – మరణము తరుముచుండగా
రండి పారి పోదుము – ఇంక దాగి యుందుము
ఏ తెగులు దరిచేరని – ఏ దిగులు ఉండని
మన దాగు స్థలములో – యేసుని సన్నిధిలో ||అంధకార||
ప్రార్ధన చేసెదము – దేవుని సముఖములో
ఈ శోధన సమయములో – విరిగిన హృదయముతో
ఈ లోక రక్షణకై – జనముల స్వస్థతకై
యేసుని వేడెదము – శోకము తొలగించమని ||అంధకార||
మొరలను ఆలకించును – యేసు మనలను విడిపించును
ఈ లోకమును శుద్ధిచేయును – మరణమును తప్పించును
మన రక్షణ వలయముగా – తన రెక్కలు చాపును
దుఃఖమును సంతోషముగా – మార్చివేయును త్వరలో ||అంధకార||