అందాల ఉద్యానవనమా Song Lyrics

అందాల ఉద్యానవనమా
ఓ క్రైస్తవ సంఘమా (2)
పుష్పించలేక ఫలియింపలేక (2)
మోడై మిగిలావ నీవు (2) ||అందాల||

ప్రభు ప్రేమలో బాగు చేసి
శ్రేష్టమౌ ద్రాక్షాగ నాటాడుగా (2)
కాచావు నీవు కారు ద్రాక్షాలు (2)
యోచించు ఇది న్యాయమేనా (2) ||అందాల||

ప్రభు యేసులో నీవు నిలచి
పరిశుద్ధాత్మతో నీవు పయనించుమా (2)
పెరిగావు నీవు ఫలియింపలేక (2)
యోచించు ఇది న్యాయమేనా (2) ||అందాల||

ఆకలిగొని నీవైపు చూడ
ఆశ నిరాశాయే ప్రభు యేసుకు (2)
ఇకనైన నీవు నిజమైన ఫలముల్ (2)
ప్రభు కొరకై ఫలియింపలేవా (2) ||అందాల||

అందాల ఉద్యానవనమా telugu christian video song


అందాల ఉద్యానవనమా Song Lyrics