ఆకాశమందు నీవుండగా Song Lyrics

ఆకాశమందు నీవుండగా
నేను ఎవరికి భయపడను
నీవీ లోకములో నాకుండగా
నేను దేనికి భయపడను (2)

శత్రుసమూహము నన్ను చుట్టినా
సైతనుడు సంహరింపజూసినా (2)
నా సహవాసిగా నీవుండగా
నేను ఎవరికి భయపడను (2) ||ఆకాశమందు||

వ్యాధులు కరువులు శోధనలు
బాధలు దుఃఖము వేదనలు (2)
మరణము మ్రింగగ కాంక్షించినా
నేను దేనికి భయపడను (2) ||ఆకాశమందు||

పడిపోయిన వెనుకంజ వేయక
పశ్చాత్తాపము పడి అడుగు (2)
నిను క్షమియించును నీ ప్రభువే
నీవు ఎవరికి భయపడకు (2) ||ఆకాశమందు||

ఆకాశమందు నీవుండగా telugu christian video song


ఆకాశమందు నీవుండగా Song Lyrics