అంబరాన్ని దాటే సంబరాలు నేడు
నింగిలో చుక్క బుట్టి వచ్చింది మనకు తోడు (2)
రండయ్యో రండి రండి దావీదు పురముకు (2)
రారాజు పుట్టి ఇల పిలిచెను కొలువుకు (2) ||అంబరాన్ని||
దేవుడు ఎంతగానో ప్రేమించి లోకము
ఏకైక తనయుని పంపెను ఈ దినము (2)
పశువుల పాకలో ఒదిగేను శిశువుగా (2)
అవతరించే నేడు లోక రక్షకునిగా (2) ||రండయ్యో||
దేవాది దేవుడు మనిషిగా మారిన వేళ
శాపాలు పాపాలు రద్దయిన శుభవేళ (2)
లోకాల కారకుడు లోకమున పుట్టెను (2)
మనిషి మరణము ఆయువు తీరెను (2) ||రండయ్యో||