ఆశ్రయమా ఆధారమా Song Lyrics

ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా
నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా (2)
నిను విడచి నేనుండలేను
క్షణామైనా నే బ్రతుకలేను (2) ||ఆశ్రయమా||

కష్ట కాలములు నన్ను కృంగదీసినను
అరణ్య రోదనలు నన్ను ఆవరించినను (2)
నా వెంటే నీవుండినావు
నీ కృపను చూపించావు (2) ||ఆశ్రయమా||

భక్తిహీనులు నాపై పొర్లిపడినను
శత్రు సైన్యము నన్ను చుట్టి ముట్టినను (2)
నా వెంటే నీవుండినావు
కాపాడి రక్షించినావు (2) ||ఆశ్రయమా||

మరణ పాశములు నన్ను చుట్టుకొనగాను
బంధు స్నేహితులు నన్ను బాధపెట్టినను (2)
నా వెంటే నీవుండినావు
దయచూపి దీవించినావు (2) ||ఆశ్రయమా||

ఆశ్రయమా ఆధారమా telugu christian video song


ఆశ్రయమా ఆధారమా Song Lyrics