ఇదేనా న్యాయమిదియేనా Song Lyrics

ఇదేనా న్యాయమిదియేనా
కరుణామయుడు యేసు ప్రభుని – సిలువ వేయ ||ఇదేనా||

కుంటి వారికి కాళ్ళ నొసగే
గ్రుడ్డి వారికి కళ్ళ నొసగే
రోగుల నెల్ల బాగు పరిచే – ప్రేమ మీర ||ఇదేనా||

చెడుగు యూదులు చెరను బట్టి
కొరడా దెబ్బలు కసిగా గొట్టి
వీధులలోనికి ఈడ్చిరయ్యో – రక్తము కారన్ ||ఇదేనా||

మోయలేని సిలువ మోపి
గాయములను ఎన్నో చేసి
నడవలేని రాళ్ళ దారిన్ – నడిపిరయ్యో ||ఇదేనా||

ప్రాణముండగానే సిలువ కొయ్యకు
మేకులెన్నో కొట్టిరయ్యో
ప్రక్కలోనే బల్లెముతో – పొడిచిరయ్యో ||ఇదేనా||

ఎన్ని బాధలు పెట్టిన గాని
మారు పల్కడు యేసు ప్రభువు
ఎంత ప్రేమ ఎంత కరుణ – ఎంత జాలి ||ఇదేనా||

ఎన్ని మారులు పాపము చేసి
యేసుని గాయముల్ రేపెదవేల
నరక బాధ ఘోరమయ్యొ – గాంచవేల ||ఇదేనా||

ఇదేనా న్యాయమిదియేనా telugu christian video song