ఉదయించినాడు Song Lyrics

ఉదయించినాడు నా జీవితాన
నా నీతిసూర్యుడు నా యేసయ్యా
నా నీతిసూర్యుడు నా యేసయ్యా (2)
సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ
ఇష్టులైన వారికిల సమాధానము (2) ||ఉదయించినాడు||

మతిలేని నా జీవితాన్ని – మరువలేదు నా మెస్సయ్యా (2)
మరియమ్మ గర్భాన జన్మించినాడు
మార్చెను నా బ్రతుకును నా యేసయ్యా (2)
మార్చెను నా బ్రతుకును నా యేసయ్యా ||ఉదయించినాడు||

గురిలేని ఈ యాత్రలోన – గుర్తించి నన్ను పిలిచెను (2)
గుణవంతుడైన నా యేసయ్యనే
గురిగా నేను నిలుపుకుంటినే (2)
గురిగా నేను చేసుకుంటినే ||ఉదయించినాడు||

కష్టాల కడగండ్లలోన కన్నీరు నే కార్చగా (2)
కడతేర్చుటకు కరుణామయునిగా
ఇలలో నాకై ఏతెంచెను (2)
ఇలలో నాకై ఏతెంచెను ||ఉదయించినాడు||

ఉదయించినాడు telugu christian video song


ఉదయించినాడు Song Lyrics