ఎక్కడో మనసు వెళ్ళిపోయింది Song Lyrics

ఎక్కడో మనసు వెళ్ళిపోయింది
ఏమిటో ఇటు రానే రానంది
ఆహాహా.. ఓహోహో…
నిజ ప్రేమ చెంతకు తను చేరానంటుంది
ఈ భువిలోన ఎక్కడైనను కానరాదంది (2)
అక్కడే చిక్కుకుపోయానంటుంది
బయటకు రానే రాలేనంటూ మారాము చేస్తుంది (2) ||ఎక్కడో||

జీవితాంతము పాద చెంతనే ఉంటానంటుంది
తన ప్రియుని వదలి క్షణమైనా రాలేనన్నది (2)
దేనికీ ఇక చోటే లేదంది
యేసు రాజుని గుండె నిండ నింపుకున్నానంటుంది (2) ||ఎక్కడో||

ఏకాంతముగా యేసయ్యతో ఉన్నానంటుంది
ఎవరైనా సరే మధ్యలో అసలెందుకు అంటుంది (2)
అక్కడే కరిగిపోతానంటుంది
ప్రేమ ప్రవాహములో మునిగి పోయానంటుంది (2) ||ఎక్కడో||

ఎక్కడో మనసు వెళ్ళిపోయింది telugu christian video song


ఎక్కడో మనసు వెళ్ళిపోయింది Song Lyrics