ఎందుకో దేవా ఇంతటి ప్రేమా
ఎన్నిక లేని నరుని మీద (2)
మమతకు ప్రేమకు అర్హత లేని (2)
మంటిపై ఎందుకు ఇంత ప్రేమ ||ఎందుకో||
ఎందుకు పనికిరాని నన్ను
ఎన్నుకొంటివి ఎందుకయ్యా (2)
ఎంచితివి నీ పుత్రికగా నన్
పెంచితివి నీ కృపతో నన్ను ||ఎందుకో||
సర్వ పాపముల పరిహారి
సర్వ జనులకు ఉపకారి (2)
శాపము నొందిన దోషి మీద
శాశ్వత ప్రేమను చూపితివా ||ఎందుకో||
నాశ మార్గములో బ్రతికిన నన్ను
నీతి మార్గముకు పిలిచితివా (2)
నిత్యము నీతో యుండుటకు
పాపిని నన్ను పిలచితివా ||ఎందుకో||