ఓ క్రీస్తు సంఘమా, పరిశుద్ధ సంఘమా
ప్రభువు నామములో సాగే అనుబంధమా
ఓ ప్రియ సంఘమా, యేసయ్య దేహమా
ఓ కంట కన్నీరు తగదు సహవాసమా
ప్రతి కష్టము మనము పంచుకుందాము
కలిసి అందరము వేడుకుందాము (2) ||ఓ క్రీస్తు||
మనమంతా కలిసి ఆ దేవుని దేహము
తండ్రి చిత్తముగా ఏర్పడిన సంఘము (2)
ఏ భాగము శ్రమ పడినా కలిగెను వేదన
ఒక్కరికి ఘనతయినా అందరికి ఆదరణ (2) ||ప్రతి కష్టము||
సాటి సోదరులు శ్రమల పాలైనపుడు
సాతాను శక్తులచే శోధింపబడినపుడు (2)
ధైర్యమును నింపాలి, విశ్వాసము పెంచాలి
ఎడతెగక ప్రార్థించి శోధనను గెలవాలి (2) ||ప్రతి కష్టము||
శ్రమలు పొందేవారు అవిధేయులు కారు
విశ్వాసము పెంచుకొని దేవునిలో ఎదిగేరు (2)
శాంతమును పాటించి, దేవునిలో వీక్షించి
పంచాలి ఓదార్పు వదిలేసి మన తీర్పు (2) ||ప్రతి కష్టము||