కల్వరి ప్రేమను Song Lyrics

కల్వరి ప్రేమను తలంచునప్పుడు
కలుగుచున్నది దుఃఖం
ప్రభువా నీ శ్రమలను ధ్యానించునప్పుడు
పగులుచున్నది హృదయం (2)

గెత్సేమనే అను తోటలో
విలపించుచు ప్రార్ధించు ధ్వని (2)
నలువైపులా వినబడుచున్నది
పగులుచున్నవి మా హృదయములు
కలుగుచున్నది దుఃఖం

సిలువపై నలుగ గొట్టిననూ
అనేక నిందలు మోపిననూ (2)
ప్రేమతో వారిని మన్నించుటకై
ప్రార్ధించిన ప్రియ యేసు రాజా
మమ్మును నడిపించుము ||కల్వరి||

మమ్మును నీవలె మార్చుటకై
నీ జీవమును ఇచ్చితివి (2)
నేలమట్టుకు తగ్గించుకొని
సమర్పించితివి కరములను
మమ్మును నడిపిపంచుము ||కల్వరి||

కల్వరి ప్రేమను telugu christian video song


కల్వరి ప్రేమను Song Lyrics