గొర్రెపిల్ల జీవ గ్రంథమందు Song Lyrics

గొర్రెపిల్ల జీవ గ్రంథమందు – నీ పేరున్నదా
పరలోక రాజ్య ప్రవేశము – నీకున్నదా
ఏది గమ్యము ఏది మార్గము
యోచించుమా ఓ క్రైస్తవా (2) ||గొర్రెపిల్ల||

ఆరాధనకు హాజరైనా
కానుకలు నీవు ఎన్ని ఇచ్చినా (2)
ఎన్ని సభలకు నీవు వెళ్ళినా
మారుమనసు లేకున్న నీకు నరకమే (2) ||గొర్రెపిల్ల||

సంఘములో నీవు పెద్దవైనా
పాటలెన్నో నీవు పాడినా (2)
వాక్యమును నీవు బోధించినా
మారుమనసు లేకున్న నీకు నరకమే (2) ||గొర్రెపిల్ల||

ఉపవాసములు ఎన్ని ఉన్నా
ప్రార్థనలు నీవు ఎన్ని చేసినా (2)
ప్రవచనములు నీవు ఎన్ని పలికినా
మారుమనసు లేకున్న నీకు నరకమే (2) ||గొర్రెపిల్ల||

గొర్రెపిల్ల జీవ గ్రంథమందు telugu christian video song


గొర్రెపిల్ల జీవ గ్రంథమందు Song Lyrics