దేవా ఇలలోన నీవు Song Lyrics

దేవా ఇలలోన నీవు మాకిచ్చిన గృహము
మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము (2)
మా యజమానివి నీవై మమ్ములను నడిపించు
నీ పనికి పాటుపడేలా పాత్రలుగా దీవించు (2)
వందనములు అందుకో మా యేసయ్యా
కలకాలం నీ కాపుదలే కావాలయ్యా (2) ||దేవా||

నువ్వు పుట్టిన రోజు నీకు స్థలమైనా లేదయ్యా
పరిచర్య చేయు సమయము ఏ గృహము నీకుందయ్యా (2)
ఆ ఒలీవల కొండలలోనే తల దాచిన యేసయ్యా
నీ వారలుగా ప్రేమించి నీ గృహమున నిలిపావా ||వందనములు||

నీ ప్రేమను ప్రతిఫలించగా నీ వెలుగును పంచుమయా
నీ నీడలో మే సాగుటకు మా గృహమును కట్టుమయా (2)
శోధన వేదనలెదిరించే బలమును అందించుమయ్యా
నీ కృపలను చాటించేటి సాక్ష్యములతో నింపుమయ్యా ||వందనములు||

నీ ఆజ్ఞలు పాటించేటి హృదయముతో మేముండాలి
నిరతము తరగని నీ కృపతో తరతరములు నిండాలి (2)
సమాధాన కర్తవు నీవై మా తోడుగా నీవుండాలి
కలిమిలేమిలందు సైతం నీ మార్గములో సాగాలి ||వందనములు||

దేవా ఇలలోన నీవు telugu christian video song


దేవా ఇలలోన నీవు Song Lyrics