నా ప్రాణం తల్లడిల్లగా
భూదిగంతముల నుండి మొర పెట్టుచున్నాను
దేవా నా మొర ఆలకించుమా
నా ప్రార్థనకు చెవియొగ్గుమా (2)
నా ప్రాణం తల్లడిల్లగా
భూదిగంతముల నుండి మొర పెట్టుచున్నాను (2)
నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకి
ఎక్కించుము నను నడిపించుము (2) ||దేవా||
నీవు నాకు ఆశ్రయముగ నుంటివి
శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి (2)
యుగయుగములు నేను నీ గుడారములో నుందును
నీ రెక్కల చాటున దాగి యుందును (2)
నీ రెక్కల చాటున దాగి యుందును ||దేవా||
నా రక్షణ మహిమకు ఆధారము నీవే
నా ఆశ్రయ దుర్గం నా నిరీక్షణ మార్గము నీవే (2)
నీ ప్రేమ బాటలో నడిపించుమయ్యా
నీ పోలికగా నన్ను మలచుమయ్యా (2)
నీ పోలికగా నన్ను మలచుమయ్యా ||దేవా||