నా జీవితాంతము Song Lyrics

నా జీవితాంతము
నీ సేవ చేతునంటిని
నే బ్రతుకు కాలము
నీతోనే నడుతునంటిని
నా మనవి వింటివి
నన్నాదుకొంటివి (2) ||నా జీవితాంతము||

నీ ప్రేమ చూపించి
నన్ను నీవు పిలిచితివి
నీ శక్తి పంపించి
బలపరచి నిలిపితివి(2)
నా ప్రాణప్రియుడా నా యేసయ్యా (2) ||నా జీవితాంతము||

రోగముతో పలుమార్లు
పడియుండ లేపితివి
ఘోరమై పోకుండా
స్థిరపరచి కాచితివి(2)
నా ప్రాణప్రియుడా నా యేసయ్యా (2) ||నా జీవితాంతము||

దూషించు దుష్టులకు
సిగ్గును కలిగించితివి
వేలాది ఆత్మలకు
మేలుగ నన్నుంచితివి (2)
నా ప్రాణప్రియుడా నా యేసయ్యా (2) ||నా జీవితాంతము||

సంఘములు కట్టుటకు
సామర్ధ్యమిచ్చితివి
ఉపదేశమిచ్చుటకు
దేశములు తిప్పితివి(2)
నా ప్రాణప్రియుడా నా యేసయ్యా (2) ||నా జీవితాంతము||

నా జీవితాంతము telugu christian video song

నా జీవితాంతము Song Lyrics