నా తల్లి నను మరచినా Song Lyrics

నా తల్లి నను మరచినా
నా వారే నను విడచినా (2)
విడువని దేవుడవయ్యా
ఎడబాయని వాడవయ్యా (2)
యేసయ్యా హల్లెలూయా (4) ||నా తల్లి||

స్నేహితులే నన్ను బాధించినా
బంధువులే నన్ను వెలివేసినా (2)
అన్నదమ్ములే నన్ను నిందించినా
నే నమ్మినవారే గాయపరచినా (2) ||విడువని||

లోకమంతా నన్ను ఏడ్పించినా
శత్రువులే నన్ను వేధించినా (2)
సాతానే నన్ను శోధించినా
సమాజమే నన్ను త్రోసేసినా (2) ||విడువని||

నా తల్లి నను మరచినా telugu christian video song