నా సంకట దుఃఖములెల్ల తీరిపోయెగా
నశింపజేయు దూత నన్ను దాటిపోయెను (2) ||నా సంకట||
విలువైన గొర్రెపిల్ల రక్తము ద్వారా (2)
కలిగియున్న రక్షణలో దాగియుంటిని (2) ||నా సంకట||
ఇంకా నేను ఫరోకు దాసుడను కాను (2)
ఇంకా నేను సీయోను కన్యుడను గాను (2) ||నా సంకట||
మార్చబడు నాడు మారా మధురముగా (2)
పారు జలము బండనుండి త్రాగుచుండును (2) ||నా సంకట||
సౌందర్యమయమగు పరమ కానాను (2)
నా నిత్యమైన స్వాస్థ్యమది మార్పుజెందదు (2) ||నా సంకట||
ఆనందమే పరమానందమే (2)
కానాను జీవితము నా కానందమే (2) ||నా సంకట||
నా దేవుడే ఎడారిలో నాదు ప్రభువు (2)
నా దేవుడిచ్చు క్రొత్త మన్నా నాకు చాలును (2) ||నా సంకట||
నా యేసు ప్రభువే నా బలము గానము (2)
నా యేసు ప్రభువే నా రక్షణ హల్లెలూయా (2) ||నా సంకట||