నిత్య జీవపు రాజ్యములో Song Lyrics

నిత్య జీవపు రాజ్యములో
సత్య దేవుని సన్నిధిలో (2)
నిత్యం యేసుని స్నేహముతో
నిత్యమానందమానందమే (2)

వ్యాధి భాధలు లేవచ్చట
ఆకల్దప్పులు లేవచ్చట (2)
మన దీపము క్రీస్తేలే
ఇక జీవితం వెలుగేలే (2) ||నిత్య||

కడు తెల్లని వస్త్రముతో
పరి తేజో వాసులతో (2)
రాజ్యమునేలుదుములే
యాజకులము మనమేలే (2) ||నిత్య||

ప్రతి భాష్పబిందువును
ప్రభు యేసే తుడుచునులే (2)
ఇక దుఖము లేదులే
మన బ్రతుకే నూతనమే (2) ||నిత్య||

పరిశుద్ధ జనములతో
పరిశుద్ధ దూతలతో (2)
హల్లెలూయా గానాలతో
వెంబడింతుము యేసునితో (2) ||నిత్య||

నిత్య జీవపు రాజ్యములో telugu christian video song