నిబ్బరం కలిగి ధైర్యముగుండు
దిగులు పడకు జడియకు ఎప్పుడు (2)
నిన్ను విడువడు నిన్ను మరువడు
ప్రభువే నీ తోడు
హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా
ఊరక నిలిచి ప్రభువు చూపే – రక్షణ చూద్దాము
నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ – కనబడరన్నాడు
హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా ||నిబ్బరం||
పర్వతాలు తొలగినా – మెట్టలు తత్తరిల్లినా (2)
ప్రభు కృప మమ్మును విడువడుగా (2)
ఎక్కలేని ఎత్తైన కొండను
ఎక్కించును మా ప్రభు కృప మమ్మును
ప్రభువే మా బలము ||హల్లెలూయా||
మునుపటి కంటెను – అధికపు మేలును (2)
మా ప్రభు మాకు కలిగించును (2)
రెట్టింపు ఘనతతో మా తలను ఎత్తును
శత్రువు ఎదుటనే భోజనమిచ్చును
ప్రభువే మా ధ్వజము ||హల్లెలూయా||
మా అంగలార్పును – నాట్యముగా మార్చెను
బూడిద బదులు సంతోషమిచ్చెను (2)
దుఃఖ దినములు సమాప్తమాయెను
ఉల్లాస వస్త్రము ధరియింప చేసెను
ప్రభునకే స్తోత్రం ||హల్లెలూయా||
స్త్రీ తన బిడ్డను – మరచినా మరచును (2)
మా ప్రభు మమ్మును మరువడుగా (2)
చూడుము నా అరచేతిలనే
చెక్కితి నిను అన్నాడు ప్రభువు
ప్రభువే చూచుకొనును ||హల్లెలూయా||
రాబోవు కాలమున – సమాధాన సంగతులే (2)
మా ప్రభు మాకై ఉద్దేశించెను (2)
ఇదిగో నేనొక నూతన క్రియను
చేయుచున్నానని మా ప్రభువు చెప్పెను
ఇప్పుడే అది మొలుచున్ ||హల్లెలూయా||
మేము కట్టని ఫురములను – మేం నాతని తోటలను (2)
మా ప్రభు మాకు అందించును (2)
ప్రాకారముగల పట్టణములోనికి
ప్రభువే మమ్మును నడిపింపచేయును
ప్రభువే మా పురము ||హల్లెలూయా||