నీలో సమస్తము సాధ్యమే (2)
మహొన్నతుడా యేసయ్యా
బలవంతుడా యేసయ్యా (2)
ఆరాధింతును – నిన్నే స్తుతియింతున్ (4) ||నీలో||
అలసియున్న నా ప్రాణమును సేదదీర్చువాడవు
జీవజలపు ఊటనిచ్చి తృప్తిపరచువాడవు (2)
ప్రార్థనలన్ని ఆలకించువాడవు నీవు
అడిగినవన్ని ఇచ్చేవాడవు నీవు (2) ||మహొన్నతుడా||
శోధన వేదనలలో జయమిచ్చువాడవు
బుద్దియు జ్ఞానమిచ్చి నడిపించువాడవు (2)
నిత్యజీవం ఇచ్చేవాడవు నీవు
మాతో ఉన్న ఇమ్మానుయేలువు నీవు (2) ||మహొన్నతుడా||