నీ నామం అతి మధురం
నీ గానం నే చేసెదను (2)
నిన్నా నేడు నిరతం ఏకరీతిగ ఉన్న నామము
ఎన్ని తరములైనా మార్పుచెందని ఘన నామము (2)
మహోన్నతమైనది యేసు నీ నామము
కీర్తింపతగినది సాటిలేని నీ నామం ||నీ నామం||
ఆదరించే నామం –ఆశ్రయంబగు నామం
ఆలకించే నామం –ఆత్మతో నడిపే నామం (2)
అన్ని నామములకు పైన నామం
ఉన్నతంబగు నీ నామం ||నీ నామం||
జాలి గలిగిన నామం –జాగు చేయని నామం
జవాబు నొసగే నామం –జయమునిచ్చే నామం (2)
జుంటె తేనె కన్న మధురం
జీవ జలమగు నీ నామం ||నీ నామం||