నీ ప్రేమకు సాటి లేదయా Song Lyrics

నీ ప్రేమకు సాటి లేదయా
యేసయ్యా… నీ సన్నిధి నాకు మేలయ్యా (2)
నా కొరకై ప్రాణమిచ్చితివి
నా కొరకై సిలువనెక్కితివి (2)
కరుణించి కాపాడుమా నా యేసయ్యా
కన్నీటి ప్రార్దన ఆలకించుమా (2) ||నీ ప్రేమకు||

అవిశ్వాసురాలై నేనుండగా అంధకారమందు రక్షించితివే
నా దీనస్థితిలో నా దరికి చేరి నీ వాక్యముతో బలపరచితివే (2)
మనోహరమైన నీ కృపనిచ్చి నన్నాదరించితివే (2)
నా బ్రతుకు దినములన్ని నిను వేడెదన్ నా యేసయ్యా (2)
నా యేసయ్యా…. ||నీ ప్రేమకు||

ఏమివ్వగలను నీ ప్రేమకు నా సర్వము నీవేనయా
నా అతిశయము ఆధారము నాకన్నియు నీవేనయా (2)
విశ్వాసముతో నీటిపైన నన్ను నడువనిమ్ము (2)
నా అడుగులు తడబడగా నన్నెత్తుకో నా యేసయ్యా (2)
నా యేసయ్యా…. ||నీ ప్రేమకు||

నీ ప్రేమకు సాటి లేదయా telugu christian video song


నీ ప్రేమకు సాటి లేదయా Song Lyrics