నీ పాదాలే నాకు శరణం Song Lyrics

నీ పాదాలే నాకు శరణం
యేసయ్యా నీవే ఆధారము (2)
నా ఆశ్రయ పురము – ఎత్తైన కోటవి నీవేనయ్యా (2)
నా దాగు చాటు నీవే యేసయ్యా (2) ||నీ పాదాలే||

అలసిన సమయములో ఆశ్రయించితి నీ పాద సన్నిధి (2)
నా ఆశ్రయుడా నీ కన్నా నాకు
కనిపించదు వేరొక ఆశ్రయము (2)
కనిపించదు వేరొక ఆశ్రయము
శరణం శరణం శరణం
నీవే శరణం యేసయ్యా (2) ||నీ పాదాలే||

ఇరుకు ఇబ్బందులలో చూచుచుంటిని నీ వైపు నేను (2)
నా పోషకుడా నీ కన్న నాకు
కనిపించరే వేరొక పోషకుడు (2)
కనిపించరే వేరొక పోషకుడు
శరణం శరణం శరణం
నీవే శరణం యేసయ్యా (2) ||నీ పాదాలే||

సాతాను శోధనలో పరుగెత్తితిని నీ వాక్కు కొరకు (2)
నా జయశీలుడా నీకన్న నాకు
కనిపించరే జయమును ఇచ్చే వేరొకరు (2)
కనిపించరే జయమునిచ్చే వేరొకరు
శరణం శరణం శరణం
నీవే శరణం యేసయ్యా (2) ||నీ పాదాలే||

నీ పాదాలే నాకు శరణం telugu christian video song


నీ పాదాలే నాకు శరణం Song Lyrics