నూతన సంవత్సరములో Song Lyrics

నూతన సంవత్సరములో
యేసు.. నూతన పరచుము నన్ను
నూతన జీవమిచ్చి
నూతన కృపనిమ్మయా (2)
ఆనందమే సంతోషమే
యేసయ్యలో నాకు సంబరమే (2) ||నూతన||

పాపమంత మన్నించయ్యా
పరిశుద్ధ మనసు నాకు ఇమ్మయ్యా (2)
ప్రభు నీతో నడుచుటకు
నీ సన్నిధిలో ఉండుటకు (2) ||నూతన||

వాక్యముతో కడుగుమయా
పరిశుద్ధ ఆత్మను నాకిమ్మయ్యా (2)
ప్రభు నీతో నడుచుటకు
నీ సన్నిధిలో ఉండుటకు (2) ||నూతన||

సత్యముతో నింపుమయా
నీ సాక్షిగ నేనుండుటకు (2)
ప్రభు నీతో నడుచుటకు
నీ సన్నిధిలో ఉండుటకు (2) ||నూతన||

నూతన సంవత్సరములో telugu christian video song


నూతన సంవత్సరములో Song Lyrics