నే యేసుని వెలుగులో Song Lyrics

నే యేసుని వెలుగులో నడిచెదను
రాత్రింబగలాయనతో నడిచెదను
వెల్గున్ నడిచెదను – వెంబడిచెదను
యేసుడే నా రక్షకుడు

నడిచెద నే ప్రభు యేసునితో
నడిచెద నే ప్రభు హస్తముతో
కాంతిలో నుండగ జయగాంతును
యేసునే నే వెంబడింతును

నే యేసుని వెలుగులో నడిచెదను
గాడంబగు చీకటిలో భయపడను
ఆత్మతో పాడుచు సాగిపోవుదును
యేసుడే నా ప్రియుండు ||నడిచెద||

నే యేసుని వెలుగులో నడిచెదను
వెల్గులో ప్రభు స్వరము నే వినుచుందును
సర్వమిచ్చెదను చెంతనుండెదను
యేసుడే ప్రేమామయుడు ||నడిచెద||

నే యేసుని వెలుగులో నడిచెదను
దిన సహాయము నే పొందెదను
సుఖ దుఃఖమైన మరణంబైన
యేసుడే నా యండనుండును ||నడిచెద||

నే యేసుని వెలుగులో నడిచెదను
నా దృష్టిని ప్రభుపై నుంచెదను
సిల్వ ధ్వజమునే బట్టి వెళ్లెదను
యేసుడే నా చెంత నుండును ||నడిచెద||

నే యేసుని వెలుగులో telugu christian video song


నే యేసుని వెలుగులో Song Lyrics