నే సాగెద యేసునితో Song Lyrics

నే సాగెద యేసునితో
నా జీవిత కాలమంతా (2)

యేసుతో గడిపెద యేసుతో నడిచెద (2)
పరమును చేరగ నే వెళ్లెద (2)
హనోకు వలె సాగెదా ||నే సాగెద||

వెనుక శత్రువులు వెంటాడిననూ (2)
ముందు సముద్రము ఎదురొచ్చినా (2)
మోషె వలె సాగెదా ||నే సాగెద||

లోకపు శ్రమలు నన్నెదిరించినా (2)
కఠినులు రాళ్ళతో హింసించినా (2)
స్తెఫను వలె సాగెదా ||నే సాగెద||

బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే (2)
క్రీస్తుకై హత సాక్షిగా మారిన (2)
పౌలు వలె సాగెదా ||నే సాగెద||

తల్లి మరచిన తండ్రి విడచిన (2)
బంధువులే నన్ను వెలివేసినా (2)
బలవంతుని వలె సాగెదా ||నే సాగెద||

నే సాగెద యేసునితో telugu christian video song


నే సాగెద యేసునితో Song Lyrics